సవతి కొడుకుల టిక్కెట్ పోరు
posted on Nov 28, 2012 12:16PM
.jpg)
ములాయం సింగ్ యాదవ్ రెండో భార్య కొడుకు ప్రతీక్ యాదవ్ రాజకీయాల్లోకి లోతుగా దిగాలనుకుంటున్నాడు. ఆజంగఢ్ లోక్ సభ స్థానాన్ని ఆశిస్తున్నాడు. ఆ నియోజకవర్గంలోని 24 గ్రామపంచాతీల సర్పంచ్ ల ఆధ్వర్యంలో రెండొందలమంది సమాజ్ వాదీ పార్టీ కార్యకర్తలు లక్నోకి వచ్చి ములాయం సింగ్ ని కలిసి విషయం ఏకరువు పెట్టారు.
ఆల్రెడీ టిక్కెట్టిచ్చిన బలరామ్ యాదవ్ ని పక్కనబెట్టి సవతి తల్లి కొడుక్కు ఆ స్థానాన్ని ఇవ్వడం ఇష్టంలేని ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ అభ్యర్ధిని మార్చే ప్రశ్నే లేదని పార్టీ ప్రతినిధి రాంగోపాల్ యాదవ్ తో చెప్పించాడు. ఆజంగఢ్ కి ప్రతీక్ ని నిలబెట్టాల్సిందేనంటూ అతని మద్దతుదారులు ఎస్పీ ప్రథాన కార్యాలయంముందు ధర్నాకి దిగారు.
కరవమంటే కప్పకి కోపం విడవమంటే పాముకి కోపం అన్నట్టుగా ఇప్పుడు ఇద్దరి కొడుకుల మధ్య వార్ ములాయం మెడకి చుట్టుకునేట్టు కనిపిస్తోంది. ఆజంఘడ్ స్థానం విషయంలో భవిష్యత్తులో ములాయంకి తిప్పలు తప్పేట్టు కనిపించడంలేదని రాజకీయవర్గాల అంచనా.