ములాయంకు దెబ్బ మీద దెబ్బ..
posted on Jan 21, 2017 1:38PM
.jpg)
సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ కు వరుసగా ఎదురుదెబ్బలు తగుతున్నాయి. ఇప్పటికే తండ్రీ, కొడుకుల మధ్య వారులో సైకిల్ గుర్తు అఖిలేశ్ గెలిచి ములాయంకు షాక్ ఇచ్చాడు. ఆ తరువాత ములాయంకు అత్యంత సన్నిహితుడైన అమర్ సింగ్ ఎన్నికల నేపథ్యంలో విదేశాలకు వెళ్లిపోవడంతో మరో దెబ్బ తగిలింది. ఇప్పుడు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నిన్న మొన్నటివరకు తనకు కుడిభుజంగా భావించిన పార్టీ సీనియర్ నాయకుడు అంబికా చౌదరి పార్టీకి రాజీనామా చేసి.. బీఎస్పీలో చేరారు. పార్టీలో అన్ని పదవులకు రాజీనామా చేస్తున్నానని, ఇక తనను తాను పూర్తిగా బహుజన సమాజ్ పార్టీకి అంకితం చేసుకుంటున్నానని ఆయన ప్రకటించారు.
కాగా అఖిలేష్ యాదవ్ ప్రభుత్వంలో తొలుత వెనకబడిన తరగతులు, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసిన అంబికా చౌదరి.. మరో ఎనిమిది మందితో పాటు ఉద్వాసనకు గురయ్యారు. దీంతో ఈయన కూడా పార్టీని వీడితే ములాయంకు నష్టమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.