ముద్రగడకు మళ్లీ చుక్కెదురు.. సత్యాగ్రహ యాత్రకు అనుమతి లేదు...

 

కాపు రిజర్వేషన్ల కోసం పాటుపడుతున్న ముద్రగడ పద్మనాభానికి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన తలపెట్టిన కాపు సత్యాగ్రహ యాత్రకు ఏపీ ప్రభుత్వం నుంచి చుక్కెదురైంది. గత సంఘటనల నేపథ్యంలో సత్యాగ్రహ యాత్రకు అనుమతి ఇవ్వడం లేదని తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ రవిప్రకాశ్‌ తెలిపారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం పాదయాత్రకు కూడా యాన పోలీసుల అనుమతి తీసుకోవాల్సిందేనని చెప్పారు. కాగా తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం నుంచి కాపు సత్యాగ్రహ యాత్రను ప్రారంభించాలని ముద్రగడ పద్మనాభం నిర్ణయించారు. అక్కడి నుంచి అమలాపురం మీదగా అంతర్వేది వరకు ఆయన యాత్ర తలపెట్టారు. గాంధేయ మార్గంలోనే ఈ సత్యాగ్రహ యాత్రను నిర్వహిస్తామని, కాపులకు చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయించేందుకే యాత్ర చేస్తున్నామని తెలిపారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu