ఎమ్మెస్ నారాయణ పరిస్థితి క్రిటికల్
posted on Jan 22, 2015 12:09PM

ప్రముఖ హాస్యనటుడు ఎం.ఎస్.నారాయణ ఆరోగ్య పరిస్థితి విషమంగా వుంది. హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. సంక్రాంతి సందర్భంగా తన స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా నిడమర్రుకు వెళ్ళిన ఆయన అక్కడ అస్వస్థతకు గురయ్యారు. మొదట ఆయన్ని విజయవాడలోని ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని కిమ్స్‌కి తరలించారు. ఆయన కాలేయం బాగా పాడయినట్టు తెలుస్తోంది. మలేరియా వుంది. ఊపిరితిత్తుల సమస్య కూడా వుంది. ఆయనకు ప్రస్తుతం డయాలసిస్ జరుగుతోంది. ఎంఎస్ నారాయణ చనిపోయినట్టు పుకార్లు వచ్చినప్పటికీ ఆయన కుమారుడు విక్రమ్, వైద్యులు ఈ పుకార్లను ఖండించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా వున్నప్పటికీ, ఆయన కోలుకునే అవకాశాలు కూడా వున్నాయని వారు అంటున్నారు.