తిరుమల భద్రంగా లేదా.. మరింత అలర్ట్ గా ఉండాలన్న డీజీపీ ఆదేశాల అర్దం అదేనా?

తిరుమల తిరుపతి భద్రతకు ముప్పు పొంచి ఉందా? అన్న ప్రశ్నకు పరిశీలకులు ఔననే అంటున్నారు. రాష్ట్ర డీజీపీగా బాధ్యతలు చేపట్టిన అనంతరం శ్రీవారి దర్శనం చేసుకున్న హరీష్ కుమార్ గుప్తా.. దర్శనానంతరం తిరమల భద్రతపై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. పోలీసు ఉన్నతాధికారులు, టీటీడీ ఈవో జే.శ్యామలరావు, సీవీఎస్ వో తదితరులతో ఆయన నిర్వహించిన సమావేశంలో తిరుమల భద్రత విషయంలో మరింత అలర్ట్ గా ఉండాలని ఆదేశించారు. దేశంలో ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితులనను దృష్టిలో పెట్టుకుని తిరుమలలో భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశించారు.  భక్తుల రక్షణ, ఆలయ భద్రత విషయంలో   స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ రూపొందించాలని ఆదేశించారు.  

తిరుమల  హై సెక్యూరిటీ జోన్ లో ఉంది. ఐదంచెల భద్రతా వ్యవస్థ 224 గంటలూ అప్రమత్తంగా ఉంటుంది.  రిజర్వు బెటాలియన్, ఏపీఎస్పీదళాలు టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్ , ఆ తరువాత ఎలాంటి పరిస్థితిని అయినా సరే ధీటుగా ఎదుర్కొని, క్షణాల్లో అదుపుచేసే శక్తిసామర్థ్యాలు ఉన్న అక్టోపస్ దళాలు ఎల్లవేళలా తిరుమలలో సిద్ధంగా ఉంటాయి. అయినా కూడా భద్రత విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలంటూ డీజీపీ హెచ్చరించడం ప్రాధాన్యత సంతరించుకుంది. తిరుమలలో భద్రత విషయంలో సమావేశంలో తిరుపతి   టీటీడీ ఇన్ చార్జ్  సీవీఎస్ ఓ హర్షవర్ధన్ రాజు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. తిరుమల భద్రత విషయంలో తీసుకుంటున్న చర్యలు, చేసిన ఏర్పాట్లపై ఆయన డీజీపీకి వివరించారు.   

Online Jyotish
Tone Academy
KidsOne Telugu
Related Segment News