ప్రధాని మోడీ థాయ్ ల్యాండ్ పర్యటన

ప్రధాని నరేంద్రమోడీ రెండు రోజుల ధాయ్ ల్యాండ్ పర్యటన కోసం గురువారం (ఏప్రిల్ 3) బయలు దేరి వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ థాయ్ ప్రధాని షఓటోంగ్ టార్స్ షినవ వ్రతాలతో భేటీ అవుతారు. వీరి మధ్య ద్వేపాక్షిక సంభంధాల మెరుగుదలపై చర్చ జరిగే అవకాశం ఉంది. అలాగే ఈ పర్యటనలో ప్రధాని మోడీ బెమ్ టెక్ శిఖరాగ్ర సదస్సులో  పాల్గొంటారు.

 ఈ సందర్భంగా సముద్ర సహకారాన్ని బలోపేతం చేయడానికి ఒక ఒప్పందంపై సంతకం చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే సభ్య దేశాల మధ్య పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా చర్చలు జరుగుతాయి.  ఈ శిఖరాగ్ర సమావేశానికి థాయ్ ల్యాండ్ సీఎం పేటోంగ్‌టార్న్ షినవత్రా, నేపాల్ ప్రధాని కేపీ ఓలి, భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గే, బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్, శ్రీలంక పీఎం హరిణి అమరసూర్య  హాజరుకానున్నారు. 2 018లో నేపాల్‌లోని ఖాట్మండులో జరిగిన నాలుగో బిమ్‌స్టెక్ శిఖరాగ్ర సమావేశం తర్వాత మొదటి భౌతిక సమావేశం ఇదే కావడం గమనార్హం. చివరి శిఖరాగ్ర సమావేశం 2022 మార్చిలో కొలంబోలో వర్చువల్ పద్ధతిన జరిగింది.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu
Related Segment News