గొప్ప దార్శనికుడు ఎన్టీఆర్.. ప్రధాని మోడీ నివాళి

నటుడిగా, నాయకుడిగా అంతకు మించి గొప్ప దార్శనికుడిగా ఎన్టీఆర్ ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయారని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. ఎన్టీఆర్ 102వ జయంతి సందర్భంగా ప్రధాని ఆయనకు ఘన నివాళులర్పించారు.

ఈ మేరకు సామాజిక మాధ్యమం ద్వారా ఆయన తెలుగు సినీ రంగంలో విశిష్ఠ నటుడిగా, అణగారిన వర్గాల సాధికారతకు కృషి చేసిన గొప్ప దార్శనికుడిగా ఎన్టీఆర్ ను కొనియాడారు.  తాను స్వయంగా ఎన్టీఆర్ నుంచి ఎంతో ప్రేరణ పొందానని పేర్కొన్న మోడీ, ఎన్టీఆర్ ఆశయాల సాధనకు ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu