మోడీ కుక్కపిల్ల అట!
posted on Apr 2, 2014 5:11PM
.jpg)
ప్రధానమంత్రి రేసులో ముందుండటంతోపాటు, దేశవ్యాప్తంగా బీజేపీ గాలి వీయడానికి కారకుడైన నరేంద్రమోడీని అటు కాంగ్రెస్‌తో పాటు ఇటు కాంగ్రెస్ మిత్రపక్షాలు, యుపి.ఎ భాగస్వామ్య పార్టీల నాయకులు నరేంద్ర మోడీ మీద కారాలు, మిరియాలు నూరుతున్నారు. అవకాశం దొరికితేచాలు మోడీని తమ స్థాయి నుంచి నేలబారుకు దిగజారి మరీ విమర్శిస్తున్నారు.
తాజాగా సమాజవాది పార్టీ నాయకుడు ఆజమ్ ఖాన్ నరేంద్రమోడీని ‘కుక్కపిల్ల’తో పోల్చాడు. ఆ కుక్కపిల్ల తమనేమీ చేయలేదన్న ధైర్యాన్ని ప్రదర్శించాడు. ఇక కాంగ్రెస్ నాయకుడు, నోటికొచ్చినట్టు వాగడంలో సిద్ధహస్తుడైన బేణీ ప్రసాద్ వర్మ కూడా నరేంద్ర మోడీ మీద మాటలదాడి చేశాడు. నరేంద్రమోడీని ఆయన ఆర్ఎస్ఎస్ గూండాగా అభివర్ణించారు.
మహాత్మాగాంధీని హత్యచేసిన ఆర్ఎస్ఎస్‌కి ప్రతినిధి మోడీ అన్నాడు. అలాంటి ఆర్ఎస్ఎస్ గూండా అయిన నరేంద్ర మోడీకి బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ బానిసలాంటి వాడని అభివర్ణించాడు. నరేంద్రమోడీ గూండాయిజానికి భయపడిన భారతీయ జనతాపార్టీ నాయకులు పార్టీలో వున్న అద్వానీ లాంటి సీనియర్ నాయకులను అవమానిస్తున్నారని బేణీ ప్రసాద్ వర్మ తెగ బాధపడిపోతూ అన్నాడు.