మోడీ క్యాబినెట్ లో నలబై మంది మంత్రులు?

 

రేపు నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఆయనతో బాటు కేవలం ఇరవై మంది మంత్రులు మాత్రమే పదవీ ప్రమాణం చేస్తారని మొదట వార్తలు వచ్చినా, తాజా సమాచారం ప్రకారం ఆ సంఖ్య రెట్టింపు అయినట్లు తెలుస్తోంది. వారిలో 24మంది క్యాబినెట్ హోదా మంత్రులు, మిగిలిన 16మంది సహాయ మంత్రులు ఉండవచ్చని తెలుస్తోంది. బీజేపీ సీనియర్ నేత యం. వెంకయ్యనాయుడు, తెదేపా నుండి అశోక్ గజపతిరాజు కేంద్రమంత్రులుగా పదవీ ప్రమాణం చేసే అవకాశం ఉంది.

 

ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి దేశ విదేశాల ప్రభుత్వ ప్రతినిధులతో బాటు టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ నుండి అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, లతా మంగేష్కర్, రజనీకాంత్ తదితరులు హాజరవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేప్పట్టబోతున్న చంద్రబాబు నాయుడు, తెలంగాణాకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చెప్పట్టబోతున్న కేసీఆర్ తదితరులు కూడా హాజరవుతున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu