చంద్రబాబుతో ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులునాయుడు భేటీ

ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలలో విజయం సాధించిన పీఆర్టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసులు నాయుడు బుధవారం (మార్చి 5) ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయిన శ్రీనివాసులు నాయుడు, తన విజయానికి అన్ని విధాలుగా సహకారం అందించినందుకు ఆయనకు కూటమి నేతలకు కృతజ్ణతలు తెలిపారు. అలాగే టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలలో విజయం సాధించిన గాదె శ్రీనివాసులు నాయుడిని అభినందించిన చంద్రబాబు ఆయనకు శాలువా కప్పి సన్మానించారు.

ఈ సందర్భంగా   టీచర్ల సమస్యల పరిష్కారానికి అన్ని విధాలుగా సహకారం అందిస్తానని చంద్రబాబు చెప్పారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోపం విశేష కృషి చేస్తున్నారన్నారు. ప్రభుత్వ విధానాల రూపకల్పనలో ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయాలు తీసుకుంటామని చంద్రబాబు చెప్పారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu