సైబర్ నేరగాళ్ల ఉచ్చులో నకిరేకల్ ఎమ్మెల్యే 

సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు. సాధారణ ప్రజలకు మోసం చేసే సైబర్ నేరగాళ్లు ఓ అడుగు ముందుకేసి ఎమ్మెల్యే నే బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. తెలంగాణ నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు. ప్రజా సమస్యల పరిష్కారంలో బిజీగా ఉన్న వేముల వీరేశంకు ఇటీవల ఒక న్యూడ్ కాల్ వచ్చింది. ఎమ్మెల్యే కట్ చేశారు. అయినా సైబర్ నేరగాళ్లు ఎమ్మెల్యేను వదల్లేదు. సైబర్ కేటుగాళ్లు ఎమ్మెల్యేకు చేసిన న్యూడ్ కాల్ రికార్డయ్యింది. అదే వీడియోను అడ్డం పెట్టుకుని ఎమ్మెల్యేను బ్లాక్ మెయిల్ చేశారు. ఈ వీడియో వైరల్ చేస్తాం. డబ్బులు ఇవ్వండి అని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే పట్టించుకోకపోవడంతో ఆ వీడయోను ఎమ్మెల్యే  అనుచరులకు పంపారు. ఈ విషయాన్ని  అనుచరులు  ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. వెంటనే ఎమ్మెల్యే పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu