వంగవీటి రాధాకు ఎమ్మెల్సీ?

గత అసెంబ్లీ ఎన్నికల్లో వంగ వీటి రాధాకు అసెంబ్లీ  టికెట్ దక్కకపోవడంతో ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాలని టిడిపి అధ్యక్షుడు చంద్ర బాబు యోచిస్తున్నట్టు తెలుస్తోంది. రాజ్యసభ టికెట్ ఇస్తానని హామి ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. రాజ్య సభ భర్తీ కావడంతో బాబు రాధాను ఇంటికి పిలిపించుకున్నారు. వచ్చే మార్చిలో ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీఅవుతున్న నేపథ్యంలో  రాధాతో భర్తీ చేయాలని టిడిపి యోచిస్తుంది. బలమైన కాపు సామాజిక వర్గం నుంచి రాధాకు ఎమ్మెల్సీ ఇస్తే ప్రయోజనం ఉంటుందని తెలుస్తోంది. వంగవీటి వారసత్వం నుంచి వచ్చిన రాధా కాపు సామాజికవర్గంలో పవర్ పుల్ లీడర్. ఈయనకు ఎమ్మెల్సీ ఇస్తే ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడమే గాక టిడిపి బలోపేతానికి దోహదపడనుంది. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu
Related Segment News