ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్ఎస్ కు షాక్

 

 

MLC election results, TRS MLC elections,TRS MLC election results

 

 

ఎమ్మెల్సీ ఎన్నికలు టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ కు కొంచెం తీపిని..కొంచెం చేదుని మిగిల్చాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇద్దరు అభ్యర్థుల్ని ఆయన గెలిపి౦చుకోగలిగిన...నల్గొండ,ఖమ్మం, వరంగల్ జిల్లాల అభ్యర్ధిని మాత్రం గెలిపి౦చలేకపోయారు. గ్రాడ్యుయేట్ నియోజకవర్గం నుంచి అభ్యర్ధిగా బరిలోకి దిగిన స్వామ్మిగౌడ్ 48,470 ఓట్లతో ఘనవిజయం సాధించారు. ఉత్తర తెలంగాణ జిల్లాలైన కరీంనగర్,ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల నియోజకవర్గం నుంచి పోటి చేసిన పాతూరి సుధాకరరెడ్డి 9324 ఓట్లతో గెలిచారు.



టిఆర్ఎస్ అభ్యర్ధి వరదారెడ్డి ఓటమి మాత్రం కెసిఆర్ కు మింగుడు పడడంలేదు. ఎమ్మెల్సీ ఎన్నికలను టిఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తెలంగాణవాదానికి ఇది రిఫరెండమ్ అని టిఆర్ఎస్ ప్రకటించింది. అయితే ఏ ఉద్యమంలోనూ పాల్గొనని వరదారెడ్డి కి ఈ అవకాశం ఇవ్వడం పై ఉపాధ్యాయులు హర్షించలేదని విమర్శలున్నాయి. కాని టిఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని దెబ్బతింది. నల్లగొండ,ఇతర జిల్లాల నుంచి  టిఆర్ఎస్ ఓడిపోవడంతో తెలంగాణవాదానికి రిఫరెండమ్ అని ప్రకటించిన టిఆర్ఎస్ ఎలాంటి అబిప్రాయాన్ని వ్యక్తం చేస్తుందన్నది ఆసక్తికరం.