హైకోర్టులో రోజాకు చుక్కెదురు.. ఆ తీర్పు చెల్లదు..

 

ఎమ్మెల్యే రోజాకి మళ్లీ హైకోర్టులో చుక్కెదురైంది. రోజాకు ఏడాది పాటు సస్పెన్షన్ విధించిన నేపథ్యంలో ఆమె సస్పెన్షన్ ను ఎత్తివేస్తూ.. హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిని సవాల్ చేస్తూ అసెంబ్లీ కార్యదర్శి నారాయణ అదే హైకోర్టు డివిజన్ బెంచ్ ఎదుట పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై విచారణ జరిపిన డివిజన్ బెంచ్ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు చెల్లదని స్పష్టం చేసి.. సింగిల్ బెంచ్ ఉత్తర్వులను కొట్టివేసింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu