పర్యావరణ పరిరక్షణకు..ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి : మంత్రి పొన్నం
posted on Jun 5, 2025 3:29PM

ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని లేకపోతే భవిష్యత్‌లో ఆక్సిజన్ మాస్కులు పెట్టుకునే పరిస్థితి వస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గోల్కొండ ఏరియా హాస్పిటల్లో మంత్రి మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి అని సూచించారు. చెట్లు నీడ ఇవ్వడంతో పాటు ఆక్సిజన్ అందిస్తాయి. చెట్లను పెంచడం నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్ లో ఆక్సిజన్ పెట్టుకునే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.
ఢిల్లీ పొల్యూషన్ అయిపోయింది.అక్కడ నుండి ప్రజలు వేరే రాష్ట్రాలకు వలస పోతున్నారు. వాహనాలు నడిపించే పరిస్థితి లేదన్నారు. కాలుష్యాన్ని నియంత్రణ చేసుకోకపోవడం అనేక రకాల వ్యాధులు సంక్రమిస్తున్నాయని చెప్పారు. మనకు అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే చెట్లు నాటాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ సురేష్ షెట్కార్, ఎమ్మెల్యే కౌసర్ మొహినుద్దీన్, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు పాల్గొన్నారు.