మానవత్వం చాటుకున్నా మంత్రి నాదెండ్ల

 

రోడ్డు ప్రమాద బాధితుడిని కాపాడి ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మరోసారి తన మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. విజయవాడ నుండి కాకినాడకు వెళ్లే మార్గంలో, ఆయన కాన్వాయ్ ఏలూరు జిల్లా భీమడోలు వద్ద కారు, బైక్ ఢీకొనడంతో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అదే సమయంలో అటుగా వస్తున్న మంత్రి స్వయంగా  మంత్రి వెంటనే గాయపడిన వారి వద్దకు వెళ్లి వారి పరిస్థితిని తనకంటూ సమీక్షించారు. వారు గాయాలతో తీవ్ర రక్తస్రావానికి గురవుతున్నదాన్ని చూసి, ఆందోళనకు లోనైన మంత్రి – తన మనసులో మానవత్వం నిగూఢంగా బలపడినట్లు మరోసారి చాటిచెప్పారు.

ఆ తర్వాత నాదెండ్ల మనోహర్ స్వయంగా 108 అంబులెన్స్‌కు కాల్ చేసి సహాయం కోరారు. అంబులెన్స్ రాగానే బాధితులను సమీపంలోని ఆసుపత్రికి తరలించేందుకు తన కాన్వాయ్‌లోని ప్రోటోకాల్ వాహనాన్ని ఎస్కార్ట్ వాహనంగా ఉపయోగించాలని అధికారులకు ఆదేశించారు. ఇది ట్రాఫిక్ క్లియర్ చేసి అంబులెన్స్ వేగంగా ఆసుపత్రికి చేరేందుకు ఎంతో తోడ్పడింది. అంతటితో ఆగకుండా, ఏలూరు జిల్లా ఎస్పీకి స్వయంగా ఫోన్ చేసిన మంత్రి నాదెండ్ల , గాయపడిన ఇద్దరికీ మెరుగైన వైద్యం అందేలా చూడాలని, అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. మంత్రి సమయస్ఫూర్తితో స్పందించి చేసిన సహాయం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu
Related Segment News