శారీ జహాసే అచ్ఛా...

 

భారతదేశ రిపబ్లిక్ డే ఉత్సవాలలో పాల్గొనడానికి ఇండియాకి వస్తున్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తన పర్యటన ముగించుకున్న తర్వాత ‘సారే జహాసే అచ్ఛా’ అనుకోవడం ఖాయం. అయితే ఆయన భార్య మిషెల్ ఒబామా మాత్రం సారే జహాసే అచ్ఛా అనుకోవడంతోపాటు.. ‘శారీ జహాసే అచ్ఛా’ అని అనుకోవడం కూడా ఖాయం. ఎందుకంటే ఆమెకు ఈ పర్యటన సందర్భంగా బోలెడన్ని బెనారస్ పట్టు చీరలు బహుమతిగా లభించబోతున్నాయి మరి. ఇండియాకి వస్తున్న అమెరికా ఆడపడుచు, ప్రథమ మహిళకు భారత ప్రధాని నరేంద్ర మోడీ 100 బనారస్ చీరలు, బనారస్ సిల్క్ మెటీరియల్ బహుమతిగా అందించనున్నారు. వారణాసి వస్త్ర ఉద్యోగ సంఘం వారు నంబర్ వన్ గ్రేడ్ పట్టు చీరలను ఇప్పటికే సిద్ధం చేసి వుంచారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu