ఆ ఊరికి దెయ్యంపట్టిందంట!
posted on Sep 12, 2012 11:49AM
.jpg)
మహబూబ్ నగర్ జిల్లా దర్గా గ్రామానికి దెయ్యం పట్టింది. ఐదేళ్లక్రితం ఆత్మహత్య చేసుకున్న మహిళ దెయ్యమై తిరుగుతోందని ఊరివాళ్లంతా బలంగా నమ్ముతున్నారు. ఆ దెయ్యం ఎప్పుడు ఎవర్ని పట్టుకుంటుందో తెలియక అనుక్షణం భయంతో వణికిపోతున్నారు. ఊరివాళ్లందరికీ ఐదేళ్లుగా ఆరోగ్యం సరిగా ఉండడంలేదని, దీనికి కారణం మహిళ ఆత్మహత్యేనని అంతా బలంగా నమ్ముతున్నారు. పిల్లలకోసం సర్కారు కట్టించిన స్కూల్ ఖాళీగా పడుంది. ఊళ్లో ఉన్న ఇళ్లన్నీ మూఢనమ్మకం కారణంగా ఒక్కొక్కటిగా ఖాళీ అవుతున్నాయ్. బతికుంటే బలుసాకు తినొచ్చన్న నమ్మకంతో కన్నతల్లిలాంటి ఉన్న ఊరిని వదిలేసి గ్రామస్తులు పక్కూళ్లకు వలసపోతున్నారు. ఏ దిక్కూ లేనివాళ్లుమాత్రం ఊళ్లోనే బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.