జుకర్ బర్గ్ ను చంపేసిన ఫేస్ బుక్...


ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ ను ఫేస్ బుక్కే చంపేసింది. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా... అసలు సంగతేంటంటే.. చనిపోయిన వారి స్మారక ప్రొఫైల్స్ ను ఇతర అకౌంట్లలోకి పోస్ట్ చేసింది ఫేస్ బుక్. దాదాపు 20 లక్షల మెమోరియల్ ప్రొఫైల్స్ ను పోస్ట్ చేసింది. ఇందులో తమ అధినేత జూకర్ బర్గ్ పేరు కూడా ఉంది. ఒక్క జుకర్ బర్గ్ పేరే కాదు.. ఇంకా ఎంతో మంది బతికున్న వారిని చనిపోయినట్టు చూపించింది. ఆ తర్వాత తమ తప్పు తెలుసుకున్న ఫేస్ బుక్ సిబ్బంది.. తమ యూజర్లకు క్షమాపణ చెప్పారు. పెద్ద తప్పు జరిగిందని... దీన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నమని ఫేస్ బుక్ తెలిపింది.