ఏవోబిలో మావోయిస్టుల దాడి

 

రాష్ట్ర స‌రిహద్దుల్లో మావొయిస్టులు మ‌రోసారి తెగ‌ప‌డ్డారు.  సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్ జవాన్లతో కూడిన బృందంపై విరుచుకుపడ్డారు. ఈ దాడిలో ఒక స‌బార్డినేట్ ఆఫీస‌ర్‌తో పాటు ముగ్గురు కానిస్టేబుల్లు కూడా అక్కడిక‌క్కడే మ‌ర‌ణించారు. ఎప్పుడు ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉండే ఎవోబి ప్రాంతం ఒక్కసారిగా తుపాకీ మోత‌ల‌తో ద‌ద్దరిల్లింది.

ఉద‌యం తొమ్మిదిన్నర ప్రాంతంలో 18 మంది స‌భ్యులున్న సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్ జ‌వాన్ల బృందం విశాఖ‌ప‌ట్నం వెళ్తూ ఏవోబి ప్రాంతంలో ఎంట‌ర్ అయింది. అయితే ముందు వెళ్లిన మూడు వ్యాన్లు సుర‌క్షింతంగానే వెళ్లిన వెనుక ఉన్న నాలుగో వ్యాన్ మావోయిస్టులు అమ‌ర్చిన మందుపాత‌ర దాటికి తునాతున‌క‌లు అయింది. ఈ పేలుడుతో వ్యాన్‌లో ఉన్న నాలుగు అక్కడిక‌క్కడే మ‌ర‌ణించారు.

అయితే పేలుడు త‌రువాత ముందు ఉన్న వ్యాన్లపై కూడా మావోయిస్ట్‌లు కాల్పుల‌కు దిగారు. బలగాలు కూడా ఎదురు కాల్పులు జరిపాయి. దాదాపు గంట‌కు పైగా కొన‌సాగిన ఈ ఎదురు కాల్పుల్లో మ‌రో ఇద్దరు జ‌వాన్లు గాయ‌ప‌డ్డారు.