మహారాష్ట్రలో రైతుల ఆందోళన..వాహనాలకు నిప్పు

మహారాష్ట్రలో రైతుల చేపట్టిన ఆందోళన హింసాత్మకమైంది. థానే జిల్లాలో ఇండియన్ నేవికి చెందిన 12,600 ఎకరాల స్థలంలో గత కొన్నేళ్లుగా కొందరు నివసిస్తున్నారు. ఆ భూమిని తమకు ఇవ్వాలని కొద్ది రోజుల క్రితం రైతులు అధికారులను కోరారు. వారి విజ్ఞప్తిని అధికారులు తిరస్కరించడంతో ఆందోళన చేపట్టారు. మొత్తం 17 గ్రామాలకు చెందిన రైతులు పలు ప్రాంతాల్లో నిరసన దీక్షలకు దిగారు. థానే-బద్లాపూర్ హైవేపై రాస్తారోకో చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు రైతులను అడ్డుకున్నారు. పోలీసులతో వాగ్వివాదానికి దిగిన రైతులు ఆగ్రహంతో వాహనాలకు నిప్పుపెట్టారు. పోలీసులపై రాళ్లు రువ్వారు..పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అదనపు బలగాలను మోహరించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu
Related Segment News