స్థానిక సంస్థల ఎన్నికలపై తీర్పు రిజర్వ్
posted on Jun 23, 2025 4:19PM

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టులో విచారణ జరిగింది. గత ఏడాదిలో ఫిబ్రవరిలో సర్పంచుల పదవీకాలం పూర్తయితే ఇంతవరకు ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదని ప్రభుత్వాన్ని, ఎన్నికల సంఘన్ని కోర్టు నిలదీసింది. దీంతో ఎన్నికలు నిర్వహించేందుకు మరో 60 రోజుల సమయం కావాలని ఎన్నికల సంఘం కోర్టును విజ్ఞప్తి చేసింది.
వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలను సకాలంలో నిర్వహించడం లేదంటూ దాదాపు ఆరు పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. దీనిపై గత కొన్నాళ్లుగా వాదనలు కొనసాగుతున్నాయి. కాగా 2024 ఫిబ్రవరి 1వ తేదీన తెలంగాణ సర్పంచ్‌ల పదవీకాలం ముగిసింది. స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. పిటిషనర్లు, ప్రభుత్వం, రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ వాదనలు విన్న తర్వాత న్యాయస్థానం ఈ తీర్పు ఇచ్చింది.