కాటేదాన్‌ బ్రిడ్జి వ‌ద్ద‌ గాయాలతో చిరుత హ‌ల్‌చ‌ల్‌!

రంగారెడ్డి జిల్లాలోని మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధి కాటేదాన్‌ అండర్‌ బ్రిడ్జి వద్ద స్థానికులు చిరుతను గుర్తించారు. గాయాల కారణంగా చిరుత ఎటూ కదలలేని పరిస్థితి. ఆందోళనకు గురైన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రహదారిపై రాకపోకలను నియంత్రించారు. చిరుతను చూసేందుకు జనం భారీగా గుమికూడారు. ఓ చిరుతపులి రోడ్డుపైన క‌నిపించ‌డం హైదరాబాద్‌లో కలకలం సృష్టించింది.

జాతీయరహదారి ఎన్‌హెచ్‌-7 పై గాయపడిన చిరుతను స్థానికులు గుర్తించారు. చిరుతపులి ఒంటినిండా గాయాలున్నాయి. దీంతో రోడ్డుపై ప్రయాణించేందుకు ప్రజలు భయపడ్డారు. స్థానికులు అటవీశాఖకు సమాచారం అందించారు. ట్రాఫిక్‌ను నిలిపివేసి చిరుతను బంధించేందుకు ఫారెస్ట్‌ అధికారులు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ చిరుత ఎక్కడనుండి వచ్చింది, దాని ఒంటి నిండా గాయాలు ఎందుకున్నాయి అనే విషయాలు తెలియడం లేదు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu