కోహ్లీకి లతా మంగేష్కర్ భిన్నమైన గిఫ్ట్..
posted on Dec 13, 2016 10:23AM

టీమిండియా టెస్ట్ మ్యాచ్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆట గురించి తెలియని వారుండరు. ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉండి పరుగుల వర్షం కురిపిస్తున్నాడు. ఇక ఇంగ్లండ్ తో జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్ సిరీస్ లో రికార్డులు సైతం నమోదుచేసుకున్నాడు. అతని ఆట తీరును పొరుగు దేశం క్రికెటర్లు కూడా ప్రశంసిస్తారంటేనే ఆలోచించుకోవాలి. మన దేశంలో ప్రముఖులు సైతం కోహ్లీ ఆటను ప్రశంసించిన వారు కూడా ఉన్నారు. అలాగే ఇప్పుడు ఆ జాబితాలో గాయని లతా మంగేష్కర్ కూడా చేరిపోయారు. ఇంగ్లండ్ తో జరిగిన నాలుగో టెస్ట్ మ్యాచ్ లో డబుల్ సెంచరీ చేసిన కోహ్లీని ఆమె అభినందించారు. 235 పరుగులు చేసిన కోహ్లీకి నా అభినందనలు అంటూ ఆమె ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు. అంతేకాదు తాను పాడిన 'ఆకాశ్ కే ఉస్ పార్ భీ' అనే పాట యూట్యూబ్ లింక్ ను జతచేస్తూ కోహ్లీ ప్రతిభ ఆకాశాన్నంటుతోందనే భావనతో కాస్త విభిన్నంగా బహుమతిని అందించారు.