జడ్జిగారు నాకు ఈజైలు వద్దు...

 

దాణా కుంభకోణం కేసులో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాద‌వ్‌కు జైలుశిక్ష పడిన సంగతి తెలిసిందే కదా. మూడున్నరేళ్లు జైలుశిక్షతో పాటు.. 5 లక్షల ఫైన్‌ను కోర్టు విధించింది. లాలూ ప్రసాద్ యాద‌వ్‌తో పాటు ఇంకా ఈ కేసులో నిందితులుగా ఉన్నపలువురిని హజారీభాగ్‌లోని ఓపెన్‌ జైల్లో శిక్ష అనుభవించాలని సీబీఐ కోర్టు ఆదేశించింది. అయితే తనకు ఆ ఓపెన్‌ జైలులో ఉండడం ఇష్టం లేదని జడ్జిని కోరారు. అందుకు జడ్జి దీనిపై స్పందిస్తూ... ఆ జైలులో కుటుంబ సభ్యులతో కూడా కలిసి ఉండొచ్చని అన్నారు. జడ్జి సమాధానంపై స్పందించిన లాలూ.. ఆ జైలు నక్సలైట్ల కోసం కేటాయించినదని, దయచేసి ఓపెన్‌ జైలు నిబంధనలు చూడాలని జడ్జితో అన్నారు.