టీడీపీలోకి లగడపాటి...


మాజీ ఎంపీ కాంగ్రెస్ నేత లగడపాటి రాజగోపాల్ టీడీపీ తీర్ధం పుచ్చుకోనున్నారా..? అంటే అవుననే సంకేతాలే వినిపిస్తున్నాయి. చంద్రబాబు నాయుడితో లగడపాటి భేటీ అయ్యారు. దీంతో ఆయన టీడీపీలో చేరే అవకాశం ఉందని... తెలుగుదేశం పార్టీలో చేరే రోజు ఎంతో దూరంలో లేనట్టుందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అంతేకాదు నంద్యాల ఉప ఎన్నిక ఫలితాన్ని లగడపాటి ముందే అంచనా వేశారు. ఆ ఎన్నికకు ముందు కూడా లగడపాటి, చంద్రబాబుని కలిసి, స్థానిక పరిస్థితుల్ని వివరించారట. ఇప్పుడు చంద్రబాబును కలవడంతో ఆయన త్వరలో టీడీపీలో చేరుతారని అనుకుంటున్నారు. అయితే భేటీ అనంతరం లగడపాటి మీడియాతో మాట్లాడుతూ... ముఖ్యమంత్రి రమ్మన్నారు, అందుకే వచ్చానని అన్నారు.  తమ భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని చెప్పుకొచ్చారు. అలాగే కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికల అనంతరం తాను ఎలాంటి సర్వేలు చేయలేదని లగడపాటి తెలిపారు.