వైసీపీలోకి లగడపాటి.. నిజమేనా?

లగడపాటి రాజగోపాల్.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు సుపరిచితమే.. కాంగ్రెస్ సీనియర్ నేతగా, విజయవాడ ఎంపీగా, ముఖ్యంగా పార్లమెంట్ లో పెప్పర్ స్ప్రే చేసిన వ్యక్తిగా బాగా ఫేమస్ అయ్యారు.. ప్రస్తుతానికి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు.. రాష్ట్ర విభజన జరిగితే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పిన ఆయన, అన్నట్టుగానే విభజన అనంతరం ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.. కానీ విజయవాడలో బలమైన నేతల్లో ఒకరిగా ఆయన పేరు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంది.. అలాంటి నేతను ఏ పార్టీ మాత్రం కావాలని కోరుకోదు చెప్పండి.

 

 

ఏపీలో తిరిగి పుంజుకోవాలని చూస్తున్న కాంగ్రెస్ ఇప్పటికే మాజీ సీఎం కిరణ్ కుమార్ రాకతో ఉత్సాహంగా ఉంది.. అలాగే లగడపాటిని కూడా తిరిగి పార్టీలోకి ఆహ్వానించాలని చూస్తోందట.. ఇప్పటికే ఆ దిశగా పావులు కూడా కదుపుతున్నట్టు తెలుస్తోంది.. మరోవైపు వైఎస్ జగన్ కూడా లగడపాటిని వైసీపీలోకి ఆహ్వానించాలని చూస్తున్నారట.. విజయవాడలో అధికార పార్టీ టీడీపీని ఓడించాలంటే బలమైన నేత కావాలి.. లగడపాటి వస్తే విజయవాడలో వైసీపీ బలం పెరుగుతుందని జగన్ భావిస్తున్నారట.. మొత్తానికి కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ లు లగడపాటి రాకకోసం ఎదురు చూస్తున్నట్టు తెలుస్తోంది.. అయితే విశ్లేషకులు మాత్రం లగడపాటి తిరిగి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదని, ఒకవేళ వచ్చినా అధికార పార్టీ టీడీపీలో చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భావిస్తోన్నారు.. చూద్దాం మరి లగడపాటి ఏం నిర్ణయం తీసుకుంటారో.