పార్టీలో ఉండాలా...కండీషన్స్ అప్లయ్..!
posted on May 3, 2017 4:40PM

ఆప్ పార్టీ నుండి ఇప్పటికే పలువురు నేతలు ఇతర పార్టీలోకి జంప్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మరో కీలక నేత కూడా ఆప్ నుండి జంప్ అవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆ కీలక నేత ఎవరో కాదు.. కుమార్ విశ్వాస్. తాను పార్టీ మారేది లేనిది 24 గంటల్లో చెబుతా అని చెప్పిన కుమార్ విశ్వాస్.. అరవింద్ కేజ్రీవాల్ ముందు మూడు డిమాండ్లు పెట్టినట్లు తెలుస్తోంది. ఆ డిమాండ్ లను పరిగణలోకి తీసుకుంటేనే పార్టీలో ఉంటానని తేల్చిచెప్పారంట. బీజేపీ, ఆర్ఎస్ఎస్‌ల ప్రోద్బలంతోనే కుమార్ విశ్వాస్ వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడుతున్నారు. అలాంటి వ్యాఖ్యలే అరవింద్ కేజ్రీవాల్ మీద గానీ, మనీష్ సిసోదియా మీద గానీ చేసి ఉంటే పది నిమిషాల్లో అతడిని పార్టీ నుంచి బయటకు పంపేసేవారని, కానీ తన గురించి ఎన్నిసార్లు అతడు ఏం మాట్లాడినా పార్టీ నుంచి తొలగించలేదు సరికదా.. ఎలాంటి చర్యలు తీసుకోలేదని కుమార్ విశ్వాస్ మండిపడ్డారు. ఈనేపథ్యంలోనే కుమార్ విశ్వాస్ మూడు కండీషన్లు పెట్టాడు... అవేమిటంటే..
1. అవినీతి, జాతీయవాదంపై ఎలాంటి రాజీ పడొద్దు.
2.పార్టీ కార్యకర్తలో నిత్యం కమ్యునికేషన్‌లో ఉండాలి.. వారి తరుపు వాదనలు కూడా వినాలి.
3.అమనతుల్లా ఖాన్ తొలగింపు అంశంపై తప్పకుండా చర్చ జరగాలి.
మరి ఈ కండీషన్లకు ఆప్ పార్టీ ఒప్పుకుంటుందా... కుమార్ విశ్వాస్ పార్టీ మారుతారా..? అన్న విషయం తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.