నేను చరణ్ కు బాబాయ్: శ్రీకాంత్

 

కృష్ణవంశీ దర్శకత్వంలో రాంచరణ్, శ్రీకాంత్ ప్రధాన పాత్రలలో ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. అయితే ఇందులో చరణ్ కు అన్నయ్య పాత్రలో శ్రీకాంత్ నటిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. కానీ ఈ వార్తల్లో నిజం లేదని శ్రీకాంత్ అన్నారు. ఈ విషయంపై శ్రీకాంత్ మాట్లాడుతూ... "నేను చరణ్ కు బాబాయ్ గా నటిస్తున్నాను. కృష్ణవంశీ ఒక అధ్బుతమైన కథ సిద్ధం చేసారు. కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా అవుతుంది. చరణ్ కెరీర్ లో కచ్చితంగా ఓ మంచి హిట్ చిత్రంగా నిలుస్తుంది" అని అన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu