విజయవాడ మేయర్‌గా కోనేరు శ్రీధర్
posted on Jul 3, 2014 11:55AM
.jpg)
ఆంధ్రప్రదేశ్ లో నగర పాలక సంస్థలు, పురపాలక సంఘాలకు పరోక్ష ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. విజయవాడ నగరపాలక సంస్థ మేయర్‌గా కోనేరు శ్రీధర్, డిప్యూటీ మేయర్‌గా గోగుల రమణారావు ఎన్నికయ్యారు. విజయవాడ కార్పొరేషన్ లో మొదటిసారి టిడిపి పీఠం దక్కించుకుంది. కార్పొరేషన్ లో మొత్తం 38 వార్డులు ఉండగా అందులో 37 స్థానాలను టిడిపి, ఒకస్థానంలో ఇండిపెండెంట్ గెలుపొందారు. అలాగే బాపట్ల మున్సిపల్ చైర్‌పర్సన్‌గా తోట మల్లేశ్వరి, వైఎస్ చైర్మన్‌గా రాము ఎన్నికయ్యారు. మరోవైపు కోదాడ మున్సిపల్ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముగ్గురు టీడీపీ కౌన్సిలర్లను కాంగ్రెస్ పార్టీ వారు అక్రమంగా తరలించారని ఆరోపిస్తూ కోదాడ మున్సిపల్ కార్యాలయం వద్ద టీడీపీ కౌన్సిలర్లు ధర్నా చేపట్టారు. దీంతో అక్కడ 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.