షాకింగ్ న్యూస్.. త్వరలో జగన్ కి వైసీపీ పగ్గాలు దూరం!!

 

వైసీపీ అనగానే ముందుగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ గుర్తుకొస్తారు.. కానీ వైసీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు కొలిశెట్టి శివకుమార్ గుర్తుకురారు. నిజానికి వైసీపీని స్థాపించించి జగన్ కాదు.. కొలిశెట్టి శివకుమార్ అని చాలా తక్కువ మందికి తెలుసు. మరి అలాంటిది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడునే జగన్ సస్పెండ్ చేసారు. దీంతో శివకుమార్.. జగన్ మీద తిరుగుబాటు జెండా ఎగురవేశారు. తాజాగా మీడియాతో మాట్లాడిన శివకుమార్.. జగన్ మీద విమర్శలు గుప్పించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డిని దూషించిన కేసీఆర్‌తో జగన్ కలిసి పార్టీని భ్రష్టుపట్టించారని విమర్శించారు. రాజశేఖర్‌రెడ్డిపై తనకున్న అభిమానంతో తాను వైసీపీ పెట్టానన్నారు. ఈ నేపథ్యంలో జగన్ తనవద్దకు వచ్చి కలిసి నడుద్దామని చెప్పి పార్టీలో చేరారన్నారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ప్రశ్నించినందుకు తనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారన్నారు. వైసీపీ పగ్గాలను తిరిగి తానే చేపడతానని, ఇప్పటికే ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశానని తెలిపారు. ఎన్నికల కమిషన్‌లో వైసీపీ తన పేరు మీదే ఉందని.. త్వరలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి కార్యాచరణ ప్రకటిస్తానని కొలిశెట్టి శివకుమార్ అన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu
Related Segment News