త్వరలో కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలోకి ఎంట్రీ?

 

రాష్ట్ర విభజన కారణంగా ఆంధ్రాకు చెందిన కొంత మంది కాంగ్రెస్ నేతలు పార్టీని వీడి వేరే పార్టీలలోకి మారి తమ రాజకీయ జీవితాలు కాపాడుకోగా, ఉండవల్లి, లగడపాటి, హర్షకుమార్, వంటివారు ఏకంగా రాజకీయాలనుండే తప్పుకొన్నారు. మూడేళ్ళపాటు రాష్ట్ర రాజకీయాలను శాసించిన మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఎన్నికల తరువాత రాష్ట్ర రాజకీయల నుండి కనుమరుగయిపోయారు. అయితే ఆయన ఏదో ఓరోజు బీజేపీలో చేరుతారనే వార్తలు తరచూ వినిపిస్తూనే ఉన్నాయి. డిశంబర్ 20, 21తేదీలలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాల పర్యటనకు రాబోతున్నారు. అప్పుడు ఆయన సమక్షంలో కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరవచ్చని తాజా సమాచారం. ఆయనతో బాటు మరికొంత మంది కాంగ్రెస్, వైకాపా నేతలు కూడా బీజేపీలో చేరవచ్చని ఆ పార్టీ నేతలు చెపుతున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరిక గురించి ఇంకా ఆయన దృవీకరించనప్పటికీ, ఆయన చేరడం ఖాయంగా తెలుస్తోంది.