కవితకు అస్వస్థత.. ఎయిమ్స్ కు తరలింపు
posted on Aug 22, 2024 12:45PM
ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్టై తీహార్ జైలులో ఉన్న కవిత గురువారం (ఆగస్టు 22) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో జైలు అధికారులు ఆమెను హుటాహుటిన ఎయిమ్స్ కు తరలించారు. గత కొన్ని రోజులుగా కవిత వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారని జైలు అధికారులు తెలిపారు.
కాగా గత ఐదు నెలలుగా జైలులో ఉంటున్న కవిత పలుమార్లు బెయిలు కోసం కోర్టును ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. తాజాగా ఆమె బెయిలు పిటిషన్ విచారణను దేశ సర్వోన్నత న్యాయస్థానం వాయిదా వేసింది. కాగా గత నెలలో కూడా కవిత అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలైన సంగతి తెలిసిందే. అప్పుడు కవితనున జైలు అధికారులు దీన్ దయాళ్ ఆస్పత్రికి తరలించిన చికిత్స అందించారు. ఇప్పుడు తాజాగా మరో మారు అస్వస్థతకు గురైన కవితను ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు.