కౌశిక్ రెడ్డి, శంభీర్ పూర్ రాజు హౌజ్ అరెస్ట్
posted on Sep 13, 2024 2:34PM
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మరో ఎమ్మెల్యే అరికపూడి గాంధీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. అయినా అరికెపూడి ఇంటికి వెళ్లి భోజనం చేస్తానని కౌశిక్ రెడ్డి పట్టబట్టడంతో పోలీసులు హౌజ్ అరెస్గ్ చేశారు. ఆయనతో పాటు శంభీర్ పూర్ రాజు హౌజ్ అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం కౌశిక్ రెడ్డి బిఆర్ఎస్ నేత శంభీపూర్ రాజు ఇంట్లోనే హౌజ్ అరెస్ట్ అయ్యారు. నిన్న కౌశిక్ రెడ్డిపై దాడి చేసిన కేసులో శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడిగాంధీని ఎవన్ నిందితుడిగా చేర్చారు. గత వారం రోజులుగా బిఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటలయుద్దం కొనసాగుతూనే ఉంది. నిన్న కౌశిక్ రెడ్డి నివాసంలో హౌజ్ అరెస్ట్ అయితే ఇవ్వాళ మాత్రం శంభీర్ పూర్ రాజు ఇంట్లో హౌజ్ ఇరువురు అరెస్ట్ అయ్యారు.