జైళ్ళు ఖాళీగా లేవు.. మరోసారి కమల్ ఎటకారం...
posted on Nov 6, 2017 11:18AM

హిందుత్వంపై కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. హిందూ ఉగ్రవాదం పెరిగిపోయిందంటూ.. బీజేపీ అధికారంలోకి వచ్చిన హిందూ ఉగ్రవాదం పెరిగిపోయింది అని పలు వ్యాఖ్యలు చేశాడు. ఇక ఈ వ్యాఖ్యలపై స్పందించిన హిందుత్వ సంస్థలు కమల్ హాసన్ పై ఆగ్రహం వ్యక్తం చేశాయి. అంతేకాదు కమల్ హాసన్ పే కేసు నమోదు చేశాయి. ఆయనను కాల్చిపారేయాలని.. ఉరితీయాలని.. జైల్లో పెట్టాలని మండిపడ్డారు. ఇక ఈ వ్యాఖ్యలపై స్పందించిన కమల్.. ఒక కీలక అంశంపై ప్రశ్నిస్తే జాతి వ్యతిరేకు లంటున్నారని, ప్రశ్నించడమే నేరమైనట్టు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. అంతేకాదు దేశంలోని జైళ్ళు ఖాళీగా లేవని, అందుకే కాల్చి చంపుతామనో, ఉరి తీయాలనో డిమాండ్ చేస్తున్నారని మరోసారి వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. నా ప్రకటనలకు కట్టుబడే ఉన్నా అని కమల్ స్పష్టం చేశారు.