నా అరెస్టుపై జగన్, సీఎం కుట్ర చేశారు: కెఎ పాల్
Published on: Mon May 21, 2012 12:35PM
డేవిడ్ రాజు హత్య కేసులో తనను పోలీసులు అరెస్టుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కుట్ర చేశారని కెఎ పాల్ ఆరోపించారు. గతంలో తనపై కక్ష కట్టినవారి సంగతి దేవుడు చూశాడని, ఇప్పుడు కూడా దేవుడు వారి సంగతి చూస్తాడని ఆయన అన్నారు. డేవిడ్ రాజు హత్యకు కెఎ పాల్ సూపారీ ఇచ్చాడని పోలీసులు గుర్తించినట్లు సమాచారం. దీంతోనే ఆయనను ఒంగోలులోని ఓ ప్రైవేట్ హోటల్లో అరెస్ట్ చేసి ఈరోజు ఉదయం వైద్య పరీక్షలు నిర్వహించి జిల్లా జడ్జి ఎదుట హాజరుపరిచారు. కేఏ పాల్కు రిమాండ్ విధించటంతో అతన్ని జిల్లా జైలుకు తరలించారు.


