జేడీయూ ఎమ్మెల్సీ మనోరమా దేవి ఇంట్లో మద్యం.. అరెస్ట్ వారెంట్
posted on May 11, 2016 6:14PM
.jpg)
బీహార్లో సంపూర్ణ మద్యం నిషేదం విధించిన సంగతి తెలిసిందే. కానీ మందు బాబులు మాత్రం ఆగలేక పక్క ప్రాంతాలకు వెళ్లి మరీ తాగేస్తున్నారు. అయితే ఆ రాష్ట్ర అధికార జేడీయూకి చెందిన ఎమ్మెల్సీ మనోరమా దేవి మాత్రం ఇంట్లోనే మందు పెట్టుకొని అడ్డంగా బుక్కయ్యారు. ఆమె ఇంట్లో భారీగా మద్యం సీసాలను స్వాదీనం చేసుకొని ఆమె నివాసాన్ని సీజ్ చేశారు. ఆమె అరెస్టుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అలాగే, జేడీయూ పార్టీ మనోరమాదేవిపై ఆరేళ్లపాటు సస్పెన్షన్ వేటు వేసింది కూడా
కాగా తన కారును ఓవర్ టేక్ చేసినందుకు గాను మనో రమాదేవి కొడుకు రాఖీ యాదవ్ ఓ విద్యార్ధిని కాల్చి చంపిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే తన ఇంటిని సోదా చేయగా అసలు బాగోతం బయటపడింది. కాగా ప్రస్తుతం ఆమె పరారీలో ఉన్నారు.