జయ నిర్దోషి.. స్వామి, డీఎంకే దిగ్భ్రాంతి

 

ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత నిర్దోషి అని కర్ణాటక హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఈ కేసును దాఖలు చేసిన బీజేపీ నాయకుడు సుబ్రహ్మణ్యస్వామి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ తీర్పు ప్రతి మీద అధ్యయనం చేయాల్సి వుందని, ఈ కేసును తాను వదిలిపెట్టనని సుప్రీం కోర్టుకు వెళ్తానని ఆయన ప్రకటించారు. అలాగే ఈ తీర్పు ఏఐడీఎంకె రాజకీయ ప్రత్యర్థి డిఎంకె వర్గాల్లో కూడా కలవరం రేపింది. జయలలిత రాజకీయ కెరీర్ ముగిసినట్టేనని, రాబోయే రోజుల్లో తమ పార్టీనే అధికారంలోకి వస్తుందని ఆశిస్తున్న డీఎంకే వర్గాలకు ఈ తీర్పు షాక్ ఇచ్చింది. తీర్పు వచ్చిన వెంటనే డీఎంకె వర్గాలు సమాలోచనలు జరుపుతున్నాయి. ఈకేసు విషయంలో డీఎంకె కూడా సుప్రీం కోర్టును ఆశ్రయించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu