కాంగ్రెస్ టి.సభలో జానారెడ్డిపై చెప్పు

 

Jana reddy Telangana, Jana reddy Congress, Congress Jana Reddy, Telangana issue

 

 

రాష్ట్ర మంత్రి జానారెడ్డిపై తెలంగాణ వాది చెప్పు నిరసన తెలిపాడు. నిజాం కళాశాల మైదానంలో జరిగిన తెలంగాణ సాధన సభలో మంత్రి జానారెడ్డి ప్రసంగిస్తుండగా ‘తెలంగాణ ద్రోహి ఖబర్దార్’ అని నినాదం చేస్తూ తెలంగాణ యువకుడు మంత్రిపైకి చెప్పు విసిరాడు. ఈ లోపు అప్రమత్తమైన పోలీసులు యువకున్ని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.

 

ఆ తరువాత సభలో జానారెడ్డి మాట్లాడుతూ  తెలంగాణ ప్రత్యేక జ్వాల ఇప్పటికీ ఆరలేదని, 1969 నుంచి రగులుతూనే ఉందని, ఆనాటి నుంచి ఉద్యమం రకరకాల రూపంలో వస్తోందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను కాంగ్రెస్ పార్టీ గుర్తించిందని, డిసెంబర్ 9న తెలంగాణ అవసరాన్ని సోనియా గుర్తించారు కనుకనే ప్రకటన చేశారని అన్నారు. 2001లోనే సీడబ్ల్యూసీలో తెలంగాణపై తీర్మానం చేశామని, తెలంగాణపై సంప్రదింపులు జరపాలని 2009 డిసెంబర్‌లో శాసన సభలో తీర్మానం ప్రవేశపెట్టింది, డిసెంబర్ 9న తెలంగాణ ప్రకటన చేసింది కాంగ్రెస్ పార్టీ అన్నారు. కాంగ్రెస్ ద్వారా తెలంగాణ ఏర్పడుతుందని ఈ సభతో తెలంగాణ ప్రజలకు నమ్మకం కుదిరిందని అభిప్రాయపడ్డారు.