జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రదాడి...


జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఇప్పటికే పలుమార్లు కవ్వింపు చర్యలకు పాల్పడ్డ ఉగ్రవాదులు..మరోసారి తమ పంజా విసిరారు. పోలీస్‌ బృందమే లక్ష్యంగా గ్రెనేడ్‌తో దాడి చేశారు. జమ్ముకశ్మీర్‌లోని సోపోర్‌ ప్రాంతంలోని బ్యాంక్‌ సమీపంలో పోలీసులపై  గ్రెనేడ్‌తో దాడి చేయగా.. ఈ ఘటనలో నలుగురు పోలీసులు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.