చర్చించే సమస్యే లేదు..

 

జమ్మూ కాశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో పాక్ తరచూ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి.. అనేక దాడులు చేసింది. అయితే ఇప్పుడు పాక్ దాడులపై స్పందించిన ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ జమ్ముకశ్మీర్‌లో నెలకొన్ని ఉద్రిక్త పరిస్థితుల విషయాన్ని మరొకరితో చర్చించే సమస్యే లేదని... తాము వేర్పాటువాదులతో చర్చించేందుకు ఏ మాత్రం సిద్ధంగా లేమని, తమ ప్రధాని దృష్టి మొత్తం ప్రస్తుతం పరిస్థితులను మెరుగుపరచడమే అని చెప్పారు.