విజయసాయిరెడ్డికి  జగన్ క్లాస్ 

ఢిల్లీ ధర్నాకు వెళ్లే ముందు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వైకాపా రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డికి క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎపిలో జరిగిన  గత ఎన్నికల్లో  వైకాపా ఓటమి చెంది అధికారాన్ని కోల్పోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి గత ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు, అవినీతి అని తేలిపోయింది. ఈ నేపథ్యంలో  వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి మధ్య జరుగుతున్న వివాదం వైకాపాను ఇబ్బందుల్లో నెట్టింది. మూలిగే నక్కపై త్రాటి కాయ పడ్డట్టు విజయసాయి, శాంతి వివాదం తయారయ్యింది. కూటమి ప్రభుత్వాన్ని బద్నామ్ చేయాలని యోచిస్తున్న జగన్ కు ఈ వివాదం తలవంపులు తెచ్చి పెట్టింది. పత్రికలు టీవీచానల్స్ గత కొన్ని రోజులుగా చేస్తున్న ప్రచారం  జగన్ కు ఇబ్బందికరంగా మారింది. శాంతికి పుట్టిన కొడుకు విజయసాయి ద్వారా పొందినట్టు శాంతి భర్త మదన్ మోహన్ ఆరోపిస్తున్నారు. విజయసాయికి డిఎన్ ఏ టెస్ట్ చేస్తే ఈ వ్యవహారం తేలిపోతుందని  మదన్ మోహన్ చెబుతున్నారు. ఈ ఆరోపణల తర్వాత విజయసాయి ప్రెస్ మీట్ పెట్టినప్పటికీ డిఎన్ ఏ టెస్ట్ కు మాత్రం అంగీకరించలేదు. డిఎన్ ఏ టెస్ట్ చేస్తే విజయసాయి దోషిగా తేలుతారని మదన్ మోహన్ చెబుతున్నారు. 
వైకాపా ఎంపీలతో జగన్ సమావేశమైనప్పుడు విజయసాయిరెడ్డి కూడా హాజరయ్యారు.వీరిద్దరి మధ్య ఎడ మోహం పెడ మొహం ఉండటం చర్చనీయాంశమైంది. మునుపెన్నడూ లేనివిధంగా జగన్ విజయసాయిరెడ్డిపై ఫైర్ అయ్యారట. జగన్ తర్వాత నెంబర్ టూ పొజిషన్ లో ఇలా పరాభవం చెందడాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోయారు. మిగతా ఎంపీలతో హుషారుగా కనిపించిన జగన్  విజయసాయిరెడ్డిని చూడగానే మొహం చిట్లించినట్లు తెలుస్తోంది.   జగన్ కు నచ్చజెప్పడానికి విజయసాయి విఫలం యత్నం చేశారని సమాచారం. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu
Related Segment News