బ్రహ్మానంద రెడ్డి ప్రాసిక్యూషన్ కు అనుమతి !

 

 

 

 

జగన్ అక్రమాస్తుల కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో అధికారులను విచారించాలన్న సిబిఐ విజ్ఞప్తిని కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఆ సంఘటన జరిగిన సమయంలో రాష్ట్ర మౌళిక వసతుల శాఖ కార్యదర్శిగా ఉన్న ఇండియన్ రైల్వే అకౌంట్స్ సర్వీస్ అధికారి బ్రహ్మానంద రెడ్డి ని విచారించడానికి కేంద్రం అనుమతి లభించింది.

 

దీనితో ఈ కేసు వేగం పుంజుకుంటుందని భావిస్తున్నారు. ఈ కేసులో ఆయన నాలుగో నిందితునిగా ఉన్నారు. ప్రస్తుతం చంచల్ గూడా జైలులో ఉన్న ఆయన వాన్ పిక్ భూ కేటాయింపుల్లో కొందరికి అనుకూలంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.

 

ఇప్పటి వరకూ ఎవరికీ లభించని ప్రాసిక్యూషన్ అనుమతి బ్రహ్మానంద రెడ్డికి మాత్రమే లభించింది. ఆయన రైల్వే అధికారి కావడంతో ఈ విషయంలో రైల్వే శాఖ తన వంతు ప్రయత్నాలు చేసింది. బ్రహ్మానంద రెడ్డి వైఎస్ రాజ శేఖర రెడ్డి ముఖ్య మంత్రి గా ఉన్న సమయంలో డిప్యుటేషన్ ఫై పెట్టుబడుల శాఖలో కార్యదర్శిగా పని చేశారు.