జగన్‌కు ఆయుధంగా మారిన రాజీనామా

Publish Date:May 21, 2013

 

 

 

 

కళంకిత మంత్రుల ఎపిసొడ్‌కు పులిస్టాప్‌ పెట్టాలనుకున్న కాంగ్రెస్‌ టెన్‌ జన్‌పథ్‌ సాక్షిగా భారీ కథనే నడిపింది.. కేంద్రంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మత్రులను తప్పించినట్టుగానే రాష్ట్రంలోనూ మంత్రులను సాగనంపాలని నిర్ణయించుకుంది..

 

అధిష్టాన్నాన్ని ఎలాగైన ఒప్పించి మంత్రులు పదవులు ఉండేలా చూస్తానన్న సీఎం మాట నిలబెట్టుకోలేకపోయారు.. సీఎం చెప్పిన మాటలకు అధిష్టానం ససేమిరా అనడంతో కళంకిత మంత్రలు రాజీనామ చేయక తప్పలేదు..

       

అయితే మంత్రుల రాజీనామా తరువాతే మొదలైంది అసలు కథ.. క్యాంప్‌ ఆఫీస్‌లో సీఎంను కలిసి ధర్మాన, సభిత.. తరువాత మీడియాతో మాట్లాడిన మాటలు అనేక సందేహాలకు తావిస్తున్నాయి..

       

ఇన్నాళ్లు కాంగ్రెస్‌ నేతలంతా వైయస్‌ పెట్టమంటే సంతాకాలు పెట్టాం గాని తెరవెనుక జరిగిన సంగతులతో మాకెలాంటి సంబంధం లేదంటూ పాపం అంతా జగన్‌దే అన్నట్టుగా మాట్లాడుతూ వస్తున్నారు.. కాని ఇప్పడు ఒక్కసారిగా సీన్‌ మారిపోయింది..

       

ఇన్నాళ్లు కాంగ్రెస్‌ నాయకుల చెపుతున్నమాటలకు భిన్నంగా ధర్మాన తన ప్రెస్‌ మీట్‌లో కొత్త పల్లవి అందుకున్నారు.. జిఓలకు సంబందించిన నిర్ణాయాలన్ని మంత్రివర్గ సమిష్టి నిర్ణాయాలే అనటమే కాదు వాటిలో ఎలాంటి పొరపాట్లు జరగటానికి అవకాశమే లేదంటూ కుండబద్దలు కొట్టారు..

       

మరి ధర్మాన చెప్పినట్టుగా తప్పే జరగకపోతే ఇన్నాళ్లుగా జగన్‌పై కాంగ్రెస్‌ నేతలు అంతలా దాడి ఎందుకు చేస్తున్నట్టు.. ఒకవేళ ఆ జీఓలు మంత్రి వర్గ నిర్ణయమే అయితే అప్పుడు మంత్రలందరూ బాధ్యత వహించాలి కదా.. ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఇప్పుడు సామాన్యులను వేదిస్తున్నాయి..

       

అయితే విశ్లేషకులు మాత్రం ధర్మాన మాటల వెనుక రాజకీయ వ్యూహమేదైన ఉందేమో అంటున్నారు.. జిఓలు మంత్రి వర్గ నిర్ణయం అంటే అప్పుడు తప్పైనా,  రైట్‌ అయిన మంత్రి వర్గం అంతా బాధ్యత వహిస్తుంది కనుక.. తనకు కొంత సేఫ్‌ సైడ్‌ అని భావించినట్టుగా చెబుతున్నారు..

       

ఏది ఏమైన తనను తాను రక్షించుకునే ప్రయత్నంలో జగన్‌ చేతికి బలమైన ఆయుధాన్ని అందించాడని చెపుతున్నారు విశ్లేషకులు.. మరి ముందు ముందు ఈ కాంగ్రెస్‌ మార్క్‌ రాజకీయం ఇంకెన్నీ మలుపులు తిరుగుతుందో చూడాలి..