నా అరెస్టును ఆపండి: ప్రధానికి జగన్ లేఖ
posted on May 23, 2012 9:20AM
రాష్ట్రంలో తన అరెస్టుకు కుట్ర జరుగుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప లోక్సభ సభ్యుడు జగన్మోహన రెడ్డి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎస్.వై.ఖురేషీలకు ఈరోజు లేఖ రాశారు. రాష్ట్రంలో తన అరెస్టుకు కుట్ర జరుగుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప లోక్సభ సభ్యుడు జగన్మోహన రెడ్డి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎస్.వై.ఖురేషీలకు ఈరోజు లేఖ రాశారు. ఉప ఎన్నికలను వాయిదా వేయాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తాను సీబీఐ కోర్టు ముందు హాజరుకానున్న సందర్భంగా ఈనెల 28న హైదరాబాద్‌లో 'సీన్ క్రియేట్' చేయాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారని కూడా తెలిపారు. నైతిక విలువలున్న ఏ రాజకీయ నేతా ఇంత దిగజారరని విమర్శించారు.