పెళ్లి కబురుకు వెళ్లి జగన్ కు షాకిచ్చిన లగడపాటి....
posted on Nov 5, 2017 3:50PM
.jpg)
పెళ్లి కబురు చెప్పడానికి వెళ్లి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఓ ఝలక్ ఇచ్చాడట లగడపాటి రాజగోపాల్. ఇంతకీ లగడపాటి రాజగోపాల్ ఇచ్చిన ఝలక్ ఏంటీ అని..? లగడపాటి రాజగోపాల్ అప్పుడప్పుడు జోస్యాలు చెపుతారన్న సంగతి తెలిసిందే. అవి అప్పుడప్పుడు నిజం కూడా అవుతాయి. అయితే ఈ సారి కూడా అలాంటి జోస్యమే చెప్పారట జగన్ కు. తన కుమారుడి పెళ్లి వివాహ శుభలేఖను ఇచ్చేందుకు లగడపాటి రాజగోపాల్ జగన్ ఇంటికి వెళ్లిన సంగతి తెలిసిందే. తన కుమారుడి పెళ్లికి జగన్ ను కుటుంబ సమేతంగా రావాలని ఆహ్వానించారు. అయితే ఈ సందర్భంగా లగడపాటితో జగన్ కాసేపు ముచ్చటించారట. తన పాదయాత్ర రూట్ మ్యాప్ గురించి లగడపాటికి వివరించారట. ఆ తరువాత ఫీడ్ బ్యాక్ అడుగగా.. 2019 లో వైసీపీ చాలా వెనుకబడి ఉందని... ఇది ఇలాగే కొనసాగితే.. గత ఎన్నికల్లో వచ్చిన సీట్లలో మూడొంతులు సీట్లు కూడా రావలని జగన్ కు షాక్ ఇచ్చాడట. ఇక పనిలో పనిగా లగడపాటిని తన పార్టీలోకి రమ్మని ఆహ్వానించాడట జగన్. కానీ దానికి లగడపాటి.. ఇకపై తాను రాజకీయాల్లోకి వచ్చేది లేదని చెప్పాడట. మరి లగడపాటి చెప్పిన జోస్యం నిజమవుతుందో...?లేదో...? చూద్దాం