జగన్ అందుకు అనర్హుడు...


అక్రమాస్తుల కేసులో భాగంగా జగన్ కోర్టుకు హాజరవుతున్న సంగతి తెలిసిందే. అయితే గతంలోనే పాదయాత్ర నిమిత్తం.. తనను వ్యక్తిగత హాజరు నుంచి మినహాయించాలని కోరుతూ జగన్ హైకోర్టును ఆశ్రయించగా, సీబీఐ కోర్టులోనే విన్నవించుకోవాలని హైకోర్టు సూచించింది. దీంతో జగన్ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. నవంబర్ 2 నుంచి తాను పాదయాత్ర చేపట్టనున్నందున ప్రతి శుక్రవారమూ జరిగే కోర్టు విచారణ నుంచి మినహాయింపు కావాలని జగన్ పిటిషన్ లో పేర్కొన్నాడు. ఇక ఈ పిటిషన్ ఈరోజు విచారణకు రాగా.. జగన్ కూడా కోర్టుకు హాజరయ్యారు. ఇక విచారణలో భాగంగా... తీవ్రమైన ఆర్థిక నేరాలకు పాల్పడిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వ్యక్తిగత మినహాయింపును కోరేందుకు అనర్హుడని సీబీఐ పేర్కొంది. మినహాయింపు ఇవ్వరాదని కోరింది. అయితే తుది నిర్ణయం ఇంకా తెలియాల్సి ఉంది.