ఒక ఐసిస్ ఉగ్రవాది శాడిస్టిక్ కోరికలు…

ఐసిస్… ఈ పేరు మనకు కొంత మామూలుగా వినిపించవచ్చు. కాని,సిరియా లాంటి దేశాల ప్రజలకు వెన్నులో చలి పుట్టిస్తుంది! ఐఎస్ఐఎస్ హింసకి, దుర్మార్గానికి, అమానుషానికి మరో పేరు! అసలు ఇస్లామిక్ ఉగ్రవాదం ప్రపంచం అంతటా వున్నా ఐసిస్ మాత్రం అత్యంత కరుడుగట్టింది! మరే ఉగ్రవాద సంస్థ అయినా దాని తరువాతే.

 

ఇండియాలో లష్కరే తయ్యబా, జైషే మహ్మద్, సిమీ లాంటి ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలు వున్నాయి. కాని, వీళ్లు అప్పుడప్పుడూ బాంబులు పెట్టి ప్రాణాలు బలితీసుకోవటం వరకే పరిమితం. మొన్నటికి మొన్న మన జవాన్లను చంపింది కూడా ఇండియా, పాకిస్తాన్ లాంటి దేశాల్లో తిష్టవేసిన లోకల్ టెర్రరిస్టులే. కాని, మన దగ్గర అరాచకం సృష్టించే ఉగ్రవాదులు ఐసిస్ వారి ముందు నథింగ్. కెమెరాల్లో షూట్ చేస్తూ బందీల తలలు నరకటం, పన్నెండేళ్ల అమ్మాయిల్ని కూడా రేప్ చేయటం, స్త్రీలని బహిరంగ మార్కెట్లో బానిసలుగా అమ్మటం… ఇలాంటి దారుణాలు వారికి రొటీన్! అందుకే, ఐసిస్ అంటే ప్రపంచం ఉలిక్కిపడుతోంది!. ఐఎస్ఐఎస్ కేవలం సిరియా, ఆ చుట్టుపక్కల దేశాల ఉన్మాదుల సమూహం కాదు. అమెరికా, బ్రిటన్, అస్ట్రేలియా లాంటి అగ్రదేశాల నుంచి పారిపోయిన సైకోల స్థావరం. ప్రజాస్వామ్య వ్యవస్థలో వుంటే తమ ఉన్మాదం శాంతించదన్న ఆలోచనతో ఈ యువకులు జిహాదీలుగా మారుతున్నారు. ఐఎస్ఐఎస్ నడిపే రాక్షస పాలనలో తమ ఇష్టానుసారం హింస, శృంగారాలకి పాల్పడుతున్నారు. ఈ ఉగ్రవాద శాడిస్టుల అరాచకానికి తాజా ఉదాహరణ ఒమర్ హుస్సేన్ అనే టెర్రరిస్ట్ ఇచ్చిన ఇంటర్వ్యూ!

 

బై బర్త్ బ్రిటన్ పౌరుడైన ఒమర్ మంచి జీవితాన్ని వదులుకుని ఉన్మాదంతో ఐసిస్ లో చేరాడు. అంతే కాదు, తన కొడుకుని కూడా పట్టుకుపోయాడు. ఓ సారి ఒక వీడియోలో కనిపించి అప్పటి బ్రిటన్ ప్రధాని డేవిడ్ క్యామరూన్ కు యుద్దానికి రమ్మని సవాల్ విసిరాడు!. మరోసారి ఓ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒమర్ దారుణమైన మాటలు మాట్లాడాడు. అసలు ఒక ఐసిస్ ఉగ్రవాది మెంటాలిటి ఎలా వుంటుందో కళ్లకు కట్టాడు! తనకు మనుషుల్ని చంపటం అంటే ఇష్టం అన్నాడు. అదీ బ్రిటన్ సైనికుల్ని చంపటం మరింత ఇష్టమట! ఇక తన కొడుకు చేత బందీల తలలు నరికించిన ఈ నర రూప రాక్షసుడు అది కూడా గొప్ప పనిగా చెప్పుకొచ్చాడు. తన సుపుత్రుడు ఎలాంటి భయం లేకుండా మనుషుల్ని చంపటం ఆనందం కలిగించిందట! వాడు పిరికిపంద అవ్వకుండా ఉండాలనే మర్డర్లు చేయించినట్టు ఒమర్ చెప్పాడు! ఈ మాటతో ఐసిస్ తన ఆధీనంలోని పిల్లల్ని ఎలా నాశనం చేస్తుందో అర్థం చేసుకోవచ్చు…

 

ఒకప్పటి బ్రిటన్ పౌరుడైన ఈనాటి ఐఎస్ఐఎస్ ఉగ్రవాది, ఒమర్…. కోరినట్టు బ్రిటన్ తన సైనికుల్ని పోరాడేందుకు పంపుతుందో లేదో మనకు తెలియదు. కాని, ఇలాంటి ఘోరమైన ఒక ఉగ్రవాద సంస్థని మనం ఉపేక్షిస్తూ వుండటం మానవత్వానికే పెద్ద మచ్చ!