సింహాచల ట్రస్ట్ బోర్డు చైర్ పర్సన్ నియామకం.. మిక్సహ..మిక్సస్య..మిక్సో భ్యహ

హిరణ్య కశపుడి మరణం కోసం ప్రహ్లాదుడు.. నరకాసుర సంహారానికి సత్యభామ..రావణాసురి అంతం కోసం శ్రీరాముడు..ఉద్భవించినట్టు.. చరిత్ర చెపుతోంది. వీళ్ళందరూ శక్తి వంచన లేకుండా తప్పులు చేసి దైవాగ్రహానికి గురైన వారే. అలాగే కలియుగంలో కూడా ఎవరికి వారే తప్పులు చేసి పతనం కొని తెచ్చుకోవడం మనం ఇదివరకే చూసాం. మళ్ళీ మరోసారి అదే జరుగుతోందని హిందువులు అంటున్నారు.

అత్యంత పవిత్రమైన సింహాచలం ట్రస్టు బోర్డు చైర్మన్ గా అర్ధరాత్రి జీవోతో ప్రమాణ స్వీకారం చేసిన సంచయిత క్రిష్టియన్ మత ఆచారాలను అమితంగా ఇష్టపడేవారని విశ్వసనీయంగా తెలుస్తోంది. ఆమె తల్లి ఉమా గజపతి రాజు, పూసపాటి ఆనంద గజపతి రాజు నుంచి విడాకులు తీసుకున్న అనంతరం పునర్వివాహం చేసుకున్నారు.

ఆమె పునర్వివాహం చేసుకున్న రమేష్ శర్మ కూడా బ్రదర్ అనిల్ శాస్త్రి లానే క్రైస్తవుడు అనే విషయం శర్మ గారి సోషల్ మీడియా అకౌంట్ చూసిన..కాస్త మెదడులో గుజ్జు ఉన్నోడు ఎవడికైనా ఇట్టే అర్ధం అవుతుంది. ఆయన క్రమం తప్పకుండా క్రిస్టమస్ జరుపుకునేవారు..వాటికన్ సిటీకి వెళ్లేవారు.. ఆయనతో బాటు ఉమా గజపతి రాజు కూడా క్రిస్టమస్ సెలబ్రేషన్స్ లో పాల్గొనేవారు..ఆ విషయాలు కూడా వారే సామాజిక మాధ్యమాల్లో ఉంచారు. మారుతండ్రి, తల్లితో బాటు సంచయిత కూడా క్రిష్టమస్ సెలబ్రేషన్స్ జరుపుకునేవారన్న సంగతి కూడా స్పష్టంగా తెలుస్తోంది.

క్రైస్తవ మత ఆచారాలు అనుసరించే కుటుంబంలో పెరిగిన హిందువు సంచయిత రాజు గారిని ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన  శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం (సింహాచలం) ట్రస్టు బోర్డుతో పాటు, మహారాజా అలక్ నారాయణ్ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ (మన్సాస్) చైర్మన్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది.

తనను నియమించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమని సంచయిత చెబుతున్నారు. తాను 'సేవ' చేయడానికి మాత్రమే ఈ పదవిని స్వీకరించారని కూడా అంటున్నారు. ఈ వ్యాఖ్యల్లో మర్మమేమిటో మన్సాస్ చైర్ పర్సన్ గారే మరింత వివరణ ఇస్తే ఆంద్రప్రదేశ్ ప్రజలు తరిస్తారు.