రాజస్థాన్ ను ఖంగు తినిపించిన బెంగళూరు

IPL 2013 Royal Challengers Bangalore beat Rajasthan Royals by seven wickets, RCB wins 'battle royal' against lacklustre Rajasthan in IPL 6, IPL 6 Bangalore beat Rajasthan by 7 wickets

 

బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్-6 లీగ్ మ్యాచ్ లలో భాగంగా రాజస్థాన్ రాయల్స్ X బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ కు పరాభవం తప్పలేదు. బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ టాస్ గెలిచి రాజస్థాన్ రాయల్స్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ ను బెంగళూరు బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ తో కట్టడి చేశారు. ఓపెనర్ వాట్సన్ 6 పరుగుల వద్ద మురళీ కార్తీక్ క్యాచ్ పట్టగా అర్జున్ రామ్ పాల్ బౌలింగ్ లో అతి తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరాడు. దూకుడుగా ఆడుతున్న రహానే వికెట్ ను ఉనాద్కట్  బౌలింగ్ లో దిల్షాన్ క్యాచ్ పట్టడంతో అవుటయ్యాడు. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ ద్రావిడ్ 31 బంతుల్లో 35 పరుగులు (5 ఫోర్లు), స్టువర్ట్ బిన్నీ 20 బంతుల్లో 33 పరుగులు (4 ఫోర్లు 1 సిక్సర్) మినహా ఇతర బ్యాట్స్ మెన్ ఎవరూ రాణించలేదు. రాహుల్ ద్రావిడ్ మురళీ కార్తీక్ బౌలింగ్ లో అర్జున్ రామ్ పాల్ క్యాచ్ పట్టగా పెవిలియన్ చేరాడు, స్టువర్ట్ బిన్నీ వికెట్ వినయ్ కుమార్ బౌలింగ్ లో అరుణ్ కార్తీక్ క్యాచ్ పట్టగా పడింది.  బ్రాడ్ హాడ్జ్ 13, యాగ్నిక్ 5, ఫాల్కనర్ 3, శ్రీకాంత్ 0, ఆర్పీ సింగ్ 1, త్రివేది 3, చండీల 4 నాటౌట్ గా నిలిచాడు. బౌలింగ్ విభాగంలో ఆర్పీ సింగ్ 3, వినయ్ కుమార్ 3, అర్జున్ రామ్ పాల్ 2, మురళీ కార్తీక్ 1, ఉనాద్కట్ 1 వికెట్లు పడగొట్టారు. రాజస్థాన్ రాయల్స్ 19 4 ఓవర్లలో 117 పరుగులకు ఆలౌట్ అయ్యింది. స్వల్ప లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన బెంగళూరు రాయల్ 17.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 123 పరుగులు చేసి విజయం సాధించింది. బెంగలూరు ఒపెనర్స్ దిల్షాన్ 22 బంతుల్లో 25 పరుగులు (4 ఫోర్లు), క్రిస్ గేల్ 44 బంతుల్లో 49 పరుగులు (4 ఫోర్లు 1 సిక్సర్) నాటౌట్ కలిసి మొదటి వికెట్ కు 53 పరుగులు జోడించారు. వాట్సన్ బౌలింగ్ లో దిల్షాన్ యాగ్నిక్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. తరువాత బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ 1ని ఫాల్కనర్ క్లీన్ బౌల్డ్ చేశాడు. తరువాత క్రీజ్ లోకి వచ్చిన డివిలియర్స్ 7ని వాట్సన్ బౌలింగ్ లో చందీల క్యాచ్ పట్టడంతో వెనుదిరిగాడు. వీరిద్దరూ వెంటవెంటనే అవుటవడంతో మ్యాచ్ పై రాజస్థాన్ కు ఆశ చిగురించింది. కానీ క్రిస్ గేల్ కు జంటగా క్రీజ్ లోకి వచ్చిన సౌరభ్ తివారీ 29 బంతుల్లో 25 పరుగులు (2 ఫోర్లు 1సిక్సర్) అండగా నిలవడంతో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ విజయం సాధించింది. వాట్సన్ 2, ఫాల్కనర్ 1 వికెట్ పడగొట్టారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా వినయ్ కుమార్ అవార్డు అందుకున్నాడు.